Tesla: ఇక భారత్‌కు టెస్లా జోష్.. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్ కాబోతోందా..?
కొన్ని రోజుల క్రితం ఎవరికంటా పడకుండా టెస్లా ప్రతినిధులు భారత్ వచ్చారు. పీఎంవో అధికారులతో పాటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో టెస్లా కార్ల తయారీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ పరోక్షంగా ప్రకటించారు.