Telangana Governor : లోక్సభ ఎన్నికల్లో పోటీపై తమిళిసై క్లారిటీ..
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ మీటింగ్లో ఈ వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గవర్నర్ గా తన విధిలో భాగంగానే ప్రధానిని కలిశాను తప్ప.. ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదంటు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు.