Fida

Dattatreya Granddaughter : చిన్నారి పాటకు మోదీ ఫిదా.. మనసు దోచుకున్నావంటూ ట్వీట్‌..

Dattatreya Granddaughter : చిన్నారి పాటకు మోదీ ఫిదా.. మనసు దోచుకున్నావంటూ ట్వీట్‌..

ప్రధాని మోదీకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పిల్లలను కలిసే ఏ అవకాశాన్నీ మోదీ వదులుకోరు. వాళ్లతో గడిపే సమయం దొరికితే వయసును కూడా మర్చిపోయి వాళ్లతో ఆడుకుంటారు. ఇలా పిల్లలతో మోదీ ఆడుకున్న చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దత్తాత్రేమ మనవరాలి గురించి మోదీ చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌ అవుతోంది. రీసెంట్‌గా మోదీ గొప్పతనాన్ని గురించి హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ మనవరాలు ఓ పాట పాడింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి వీడియోను దత్తాత్రేయ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొన్ని నిమిషాల్లోనే వీడియో బాగా వైరల్‌ అయ్యింది.