Gaddar: అవిశ్రాంత పోరాట యోధుడు గద్దర్.. అసంతృప్తితో నిష్క్రమించారా..?
తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే… తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని… తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. గద్దర్ ఎవరి వాడు… తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.