Free Travel

Jagan Sarkar : ఏపీలోనూ మహిళలకు ఫ్రీ బస్సు.. జగన్‌ సర్కార్ సంచలన నిర్ణయం!

Jagan Sarkar : ఏపీలోనూ మహిళలకు ఫ్రీ బస్సు.. జగన్‌ సర్కార్ సంచలన నిర్ణయం!

గ్యారంటీ పథకాలు.. కాదు కాదు ఉచితాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు. ఒకరకంగా జగన్‌కు అధికార పీఠం దగ్గర చేసింది కూడా అలాంటి గ్యారంటీలే. ఉచిత పథకాలే రికార్డు స్థాయి విజయంతో జగన్‌ను సీఎం చేశాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారాన్ని దగ్గర చేసింది కూడా.. అలాంటి ఉచిత గ్యారంటీలే ! కాంగ్రెస్ విజయం నుంచి తెలుసుకున్నారో.. ముందే అనుకున్నారో కానీ.. ఆరు గ్యారంటీలను పోలిన గ్యారంటీలను టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ జనాల మీద గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని.. ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు.

women Free Bus Travel : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా..?

women Free Bus Travel : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా..?

తెలంగాణలో త్వరలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం రాబోతోంది. దీనిపై ఇప్పటికే మహిళలంతా ఎదురు చూస్తుండగా.. మీమ్స్, జోకులు కూడా సోషల్ మీడియాలో పేలుతున్నాయి. సరే.. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలను ఎలా ఖరారు చేయబోతోంది అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఈ లోగా ప్రభుత్వం అడిగితే రెడీగా నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రిపేర్ అవుతోంది. నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్ళి.. కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ టికెట్ సిస్టమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుంటోంది.