Freedom

Divorce Women: వివాహాలనే కాదు.. విడాకులను కూడా వేడుకలా జరుపుకుందాం..

Divorce Women: వివాహాలనే కాదు.. విడాకులను కూడా వేడుకలా జరుపుకుందాం..

బంధం అనేది కలిసుంటేనే కాదు. విడివిడిగా ఉంటూనే అందరితో కలివిడిగా బ్రతికినా అది అందమైన బంధమే అవుతుంది. ఇలాంటి మాటలు నేను చెబుతున్నది కాదు. తమిళనాడు, ముంబై, అమెరికాలోని స్వదేశీ, విదేశీ గృహిణిలు ప్రయోగాత్మకంగా నిరూపించిన విషయాన్ని మీకు ఇలా ఒక్క మాటలో తెలుపుతున్నాను. గృహిణిలు అంటున్నారు, విడివిడిగా అంటున్నారు ఇంతకూ విషయం ఏంటో అనుకొని కంగారు పడకండి. విడాకుల వేడుక గురించి చెప్పే వివరం ఇది. తాజాగా మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుకు వీరు ఎప్పుడో జీవం పోసారు. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛాయుత జీవనాన్ని జీవిస్తున్నారు. వీరు ఎవరు, ఎందుకిలా చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను సృషిస్తూ ముందుకు సాగుదాం.