T BJP: తెలంగాణలో బీజేపీ ప్లాన్ బెడిసికొడుతోందా..? జమిలి ఎన్నికలతో ముప్పు తప్పదా..?
తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ఉండేది. ఆ సమయంలో బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీనే అనే పరిస్థితి ఉండేది. అయితే, బండిపై ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు ఫిర్యాదు చేసి, ఆయనను పదవి నుంచి దింపేశారు.