Hyderabad: చినుకు పడితే హైదరాబాద్‌లో వణుకు.. చిన్నారి మరణం పాపం ఎవరిది ?
డల్లాస్ చేస్తాం.. న్యూయార్క్‌లా మారుస్తాం.. ఇది హైదరాబాద్ గురించి పార్టీలు ప్రభుత్వాలు చెప్పే మాటలు. ఇవన్నీ తర్వాత సార్.. బతకనివ్వడం.. బతికేందుకు ధైర్యం ఇవ్వండి అని జనం చేస్తున్న విన్నపం. చినుకు పడితే చాలు భాగ్యనగర వాసుల వెన్నులో వణుకు మొదలవుతోన్న పరిస్థితి. ఎండాకాలంలో కురిసిన వానలు కూడా.. ఓ నిండు ప్రాణాన్ని తీసేసుకున్నాయ్. ఇది చాలు ఎంత దారుణంగా ఉన్నాయో హైదరాబాద్‌లో పరిస్థితులు చెప్పడానికి. రంగు రంగుల భవంతులు.. భారీ విగ్రహాలు, జిల్‌జిగేల్‌మనే కట్టడాలు.. ఇవన్నీ నగరానికి ఒకవైపు మాత్రమే.