National Girl Child Day : నేడు జాతీయ బాలికా దినోత్సవం ఎందుకో తెలుసా ?
భారత దేశంలో ఆడపిల్లలపై అప్పటి నుంచి ఇప్పటి దాకా వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల విషయంలో ఇంకా అసమానతలు కనిపిస్తున్నాయి. ఆడ, మగ బేధం లేదు… ఇద్దరూ సమానమే అని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి యేటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు.