KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి పెద్ద మనసు.. నిధులు సేకరించిన హిమాన్షు.. ప్రభుత్వ పాఠశాలకు వెలుగులు..!
గౌలిదొడ్డి కేశవనగర్లోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు నిధులు సేకరించి ఇచ్చాడు. దీంతో పాఠశాలను నెల రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలను హిమాన్షు పుట్టిన రోజైన జూలై 12న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించబోతున్నారు.