Hit and run case

Truck, Petrol Drivers Agitation : హిట్ అండ్ రన్ కి పదేళ్ళ జైలు…డ్రైవర్ల ఆందోళన అందుకేనా ?

Truck, Petrol Drivers Agitation : హిట్ అండ్ రన్ కి పదేళ్ళ జైలు…డ్రైవర్ల ఆందోళన అందుకేనా ?

ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు క్యూలు… వాహనదారులంతా పెట్రోల్, డీజిల్ కొట్టించుకోడానికి పోటీలు పడ్డారు… ఏంటి ఎందుకింత రష్.  పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా… అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న భారత న్యాయ సంహిత చట్టాలపై డ్రైవర్లు అభ్యంతరం చెబుతున్నారు.  హిట్ అండ్ రన్ కేసుల్లో భారీగా శిక్షలను ప్రతిపాదించడమే ఇందుక్కారణం.  అందుకే పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు, ట్రక్కుల డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దాంతో పెట్రోల్ సరఫరా ఎక్కడ ఆగిపోతుందో అని దేశవ్యాప్తంగా బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ హామీతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.