Huzurabad

ఈటల రెండుచోట్ల ఓటమికి కారణం అదేనా ?

ఈటల రెండుచోట్ల ఓటమికి కారణం అదేనా ?

ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్. అలాంటి పేరు తెచ్చుకున్నారు ఆయన! సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న ఈటల.. బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన దూకుడు ఏంటో చూపించడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరిన తర్వాత.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈటలకు.. ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయ్. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని.. ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. హుజురాబాద్‌లో తనకు తిరుగు ఉండదని భావించిన ఈటల.. ఎక్కువ గజ్వేల్‌పైనే ఫోకస్ పెట్టారు. అదే కొంప ముంచింది. రెండుచోట్ల ఓటమికి కారణం అయింది.