David Warner: గంగమ్మ తల్లి గెటప్‌లో డేవిడ్ వార్నర్.. పుష్ప 2లో రోల్ చెయ్యాలని ఫ్యాన్స్ డిమాండ్..
డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అదరగొట్టాడు. గంగమ్మతల్లి గెటప్‌లో వచ్చిన అల్లు అర్జున్ పోస్టర్‌ను తన ఫేస్‌తో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. పనిలో పనిగా దీన్ని క్రెడ్ యాప్ ప్రమోషన్స్‌కు కూడా వాడుకున్నాడు. యూపీఐలో అల్లు అర్జున్‌కు డబ్బులు పంపి.. ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. మేక్ దిస్ హ్యాపెన్ మచ్చా అంటూ తనకూ బన్నీకు ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మరోసారి గుర్తు చేశాడు.