IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్స్.. ఇకపై స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు
గత ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన బీసీసీఐ.. తాజా సీజన్ కోసం కూడా మరికొన్ని మార్పులు చేసింది. ఈసారి ఎస్ఆర్ఎస్ (స్మార్ట్ రీప్లే సిస్టమ్)ను ప్రవేశపెడుతోంది. అంటే అంపైర్ల నిర్ణయాలు మరింత కచ్చితత్వం, వేగంతో ఉండేలా ఎస్ఆర్ఎస్‌ను అమలు చేయబోతుంది.