Jaggareddy

Telangana Congress: కాంగ్రెస్‌పై మళ్లీ కస్సుమన్న జగ్గారెడ్డి.. జంపింగ్‌కు వేళాయెనా జగ్గా..

Telangana Congress: కాంగ్రెస్‌పై మళ్లీ కస్సుమన్న జగ్గారెడ్డి.. జంపింగ్‌కు వేళాయెనా జగ్గా..

ఇంతింత కాదయా ఇంటిపోరు అన్నట్లుగా ఉంటుంది కాంగ్రెస్‌లో పరిస్థితి. వాళ్లలో వాళ్లు కొట్టుకునే ప్రాసెస్‌లో.. ప్రత్యర్థి మీద యుద్ధాన్ని మర్చిపోతుంటారు. రేవంత్ వర్సెస్ సీనియర్ల వివాదం ఇప్పట్లో కాదు.. ఎప్పటికీ చల్లారదని తేలిపోయింది. అంతా బాగుందనుకునే టైమ్‌లో.. పార్టీలో ఏదొక వివాదం వస్తూనే ఉంది. దీంతో పార్టీ స్ట్రాంగ్ అవడం కష్టం అవుతోంది. రేవంత్ మీద కోపంతో ఈ మధ్యే మహేశ్వర్‌ రడ్డి పార్టీకి దూరం అయ్యారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అలక పాన్పు ఎక్కారు. ఇద్దరి పంచాయితీ ముగిసేలోపు.. ఇప్పుడు జగ్గారెడ్డి మళ్లీ సీన్‌లోకి వచ్చారు.