PAVAN KALYAN : పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ గా ఉన్నాడా? ఎక్కడో తేడా కొడుతోంది !
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) పట్టుమని నెల రోజులు కూడా లేవు. ఒక వైపు వైసీపీ (YCP) అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్ధం సభలు పూర్తిచేసి… బస్సు యాత్రతో మేమంతా సిద్ధమంటూ నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నాడు. 74 ఏళ్ళ చంద్రబాబు (Chandrababu) రోజుకి మూడు సభలు పెట్టి… 44 డిగ్రీలు ఎండలో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడు.