Kapu

Mudragada Padmanabham : త్వరలో వైసీపీ లోకి ముద్రగడ.. పవన్ పై నిలబడతాడా ?

Mudragada Padmanabham : త్వరలో వైసీపీ లోకి ముద్రగడ.. పవన్ పై నిలబడతాడా ?

కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ.. టీడీపీ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యమం ఊసే లేదు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ముద్రగడ.. ప్రస్తుతం పొలిటికల్‌ ఉక్కపోత భరించలేక ఫ్యాన్ కిందికి రావాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినా.. పార్టీ పెద్దలు మాత్రం ఆయనను వేరే విధంగా కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని పక్కన పెట్టేసింది అధికార పార్టీ. ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

KAPULU ON TDP: టీడీపీపై రగిలిపోతున్న కాపులు….  తెలంగాణ ఎన్నికల్లో ద్రోహం చేస్తారా?

KAPULU ON TDP: టీడీపీపై రగిలిపోతున్న కాపులు…. తెలంగాణ ఎన్నికల్లో ద్రోహం చేస్తారా?

తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.