MP Keshineni Nani : అహంకారమే కేశినేనికి దెబ్బ..
ఆయన తనని తాను చాలా గొప్పవాడినని అనుకుంటాడు. పార్టీతో పని లేకుండా ఎదిగిపోయానని భావిస్తాడు. పార్టీ జెండా, అధినేత బొమ్మ అవసరం లేకుండా సొంత ఇమేజ్ తో గెలిచాను అనుకుంటాడు. అక్కడితో ఆగడు.. ఎవ్వడినైనా పూచిక పుల్లలా తీసి పడేస్తాడు. వాడెంత? వీడెంత..? అని గప్పాలు కొడుతూ ఉంటాడు. ఈయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది.. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… విజయవాడ ఎంపీ. తెలుగుదేశంతో నాని అనుబంధం అంతా కలిసి పదేళ్లు మాత్రమే.