Krithi Shetty: బేబమ్మ లక్ మారబోతుందా..? కృతి శెట్టి ఆశలన్నీ వంద కోట్ల సినిమాపైనే
కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అయిందనుకున్న టైంలో ఊహించని విధంగా రూ.100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతుంది. ఇటీవల `పొన్నియిన్ సెల్వన్ 2`తో జయం రవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.