Manipur Violence: అవును మాకు సిగ్గూ శరం లేవు.. ఆ ఇద్దరు మహిళలకు క్షమాపణలతో…!
బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత కోసం మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారేమోనని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాకందరికీ అనిపిస్తుంది. బేటీ బచావో అని నినదించిన మీకు.. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెకిలింది?