Lakshadweep

India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..

India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..

లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.

Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ….మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది.  అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.