Legislature Party Leader, KCR : తెలంగాణ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్.. ఏకగ్రీవ తీర్మానం చేసిన బీఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రరంభమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన మొదటి సారిగా 39 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షం లోకి వచ్చింది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేవం జరిగింది. ఈ సారి కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.