BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు.. ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్‌లోని నివాసంలో కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు. కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరు.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.