సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్‌రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ఆది నుంచే బ్యాటు ఝుళిపించాడు.