Pinduoduo: యూజర్లను మోసం చేసిన చైనా షాపింగ్ యాప్.. 75 కోట్ల మంది డేటా చోరీ.. ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన గూగుల్
చైనాలో షాపింగ్ యాప్ బండారం బయటపడింది. అక్కడ టాప్ షాపింగ్ యాప్ అయిన పిండువోడువో యూజర్ల డేటా చోరీ చేస్తున్నట్లు తేలింది. దాదాపు 75 కోట్ల మంది డేటా చోరీకి గురైనట్లు నిపుణులు తేల్చారు. అయితే, దీనిపై చైనా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.