Medigadda Barrage

Medigadda Barriage : మేడిగడ్డ.. దేశంలోనే భారీ స్కామ్  విజిలెన్స్ రిపోర్టులో సంచలనాలు !

Medigadda Barriage : మేడిగడ్డ.. దేశంలోనే భారీ స్కామ్ విజిలెన్స్ రిపోర్టులో సంచలనాలు !

తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు.