Chandrayaan 3: చంద్రయాన్-3 కథ ఇక ముగిసినట్టే.. ఇస్రో మాజీ చైర్మన్ కీలక ప్రకటన..
చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట. చంద్రుడి సౌత్ పోల్‌లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపేశారు శాస్త్రవేత్తలు.