Rain Effect In Hyderabad: భాగ్యనగరానికి ఏమైంది..? ఒకవైపు ముసురు.. మరోవైపు వరద
గత మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ నగరం అంతటా వరద నీరు పొంగి పొర్లుతుంది. మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రమంతటా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే డ్రైనేజి మొత్తం ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటో అని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.