Movie Actor

MOHAN BABU : సినిమాల్లేవు – పాలిటిక్స్ లేవు.. భ్రమల్లోనే మోహన్ బాబు

MOHAN BABU : సినిమాల్లేవు – పాలిటిక్స్ లేవు.. భ్రమల్లోనే మోహన్ బాబు

నా.. రూటే సపరేటు.. అంటూ సినిమా డైలాగుల్ని సెటైరికల్‌గా చెప్పే నటుడు మోహన్‌బాబుకు… ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళాలో తెలియడం లేదా.. అంటే.. అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. అందుకే కొన్నేళ్ళుగా ఆయన పొలిటికల్‌ మౌనం పాటిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉండి.. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన మోహన్‌బాబు గత ఎన్నికల టైంలో వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబును ఓ రేంజ్‌లో టార్గెట్‌ చేసి మాటల తూటాలు పేల్చడంతో పాటు.. కాలేజీ ఫీజు బకాయిల చెల్లింపు పేరుతో రోడ్డెక్కి మరీ ఆందోళన చేశారాయన. వైసీపీ పవర్‌లోకి వచ్చాక జరిగిన మా ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ఆయన ప్రత్యర్ధి వర్గం ఆరోపణ. మొదట్లో బాగానే ఉందనుకున్నా.. టైం గడిచేకొద్దీ వైసీపీతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారట మోహన్‌బాబు.