Star Comedian Ali : ఆలీకి ఎంపీ టిక్కెట్ ఇస్తారా..?
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనిపించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే సీట్లపై ఆయన నజర్ పెట్టారు. అదీ కుదరకపోతే.. కనీసం రాజ్యసభ ద్వారా అయినా సరే… పార్లమెంట్ లోకి అడుగు పెట్టాలని ఆలీ భావిస్తున్నారు. గతంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా అప్పడు అవకాశం దక్కలేదు.