Nalgonda Politics

Gutha Family : పరువు పోగొట్టుకున్న గుత్తా… కొడుక్కి నల్లగొండ ఎంపీ టిక్కెట్ పై వ్యతిరేకత !

Gutha Family : పరువు పోగొట్టుకున్న గుత్తా… కొడుక్కి నల్లగొండ ఎంపీ టిక్కెట్ పై వ్యతిరేకత !

గుత్తా ఫ్యామిలీ గందరగోళంగా, ఇంకా చెప్పాలంటే… బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మీద గరం గరంగా ఉందా? అంటే.. అవునన్న సమాధానమే వస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల నుంచి. తన కుమారుడు అమిత్‌ రెడ్డిని లోక్‌సభ బరిలో దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy). అటు అమిత్‌ కూడా… నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. కానీ… తాజాగా పోటీపై పునరాలోచనలో పడ్డారట.