Nara Family

Yuvagalam: లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్‌ ! ఆ ఒక్కటే ఘోరంగా దెబ్బతీస్తోందా?

Yuvagalam: లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్‌ ! ఆ ఒక్కటే ఘోరంగా దెబ్బతీస్తోందా?

నడవనిస్తే పాదయాత్ర.. లేకపోతే దండయాత్ర ! అడుగు పడింది.. ఇక రాజకీయ పిడుగులే ! ఇదీ నారా లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు, మొదలుపెట్టడానికి ముందు టీడీపీ చేసిన హడావుడి ! జీవో నంబర్ వన్ గురించి ఆ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దాదాపు 4వందల రోజులు.. 4వేల కిలోమీటర్లు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. లోకేశ్‌ మొదలుపెట్టిన పాదయాత్ర 7వందల కిలోమీటర్ల ఫీట్ దాటింది. మరి 7వందల కిలోమీటర్లలో లోకేశ్‌కు, టీడీపీకి ఏమైనా మైలేజ్ వచ్చిందా.. యువనేత అడుగుల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారా అంటే.. అలాంటిదిదేమీ లేదు అనే సమాధానమే వినిపిస్తోంది చాలామంది నుంచి !