NZ vs SL: పోరాడకుండానే ఓడిన శ్రీలంక.. న్యూజిలాండ్ విజయం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంకను సౌథీ పెవిలియన్ చేర్చాడు. అనంతరం ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్, సమర విక్రమను ఔట్ చేసి వారిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.