ODI World Cup : నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఒకే బంతికి 13 పరుగులు..?
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. మరో విజయం సాధించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ను కివీస్ 99 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు.