MP ARAVIND : ఎవడైతే నాకేంటి ! ముందే మొదలెట్టేసిన అర్వింద్
లీడర్లలో కొందరు ఎప్పుడూ డిఫరెంట్. వీళ్లు డోంట్ కేర్ లీడర్లు అన్నమాట. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అంతే. ఎవడు ఏమనుకున్నా నాపని నాదే అనుకుంటాడాయన. నిజామాబాదులో అసమ్మతి బ్యాచ్ ఆయనకు ఎర్త్ పెట్టాలని ఇప్పటికే అన్ని అస్త్రాలు రెడీ చేసింది. అసలు సీట్ కూడా అనౌన్స్ చేయలేదు. అయినా సరే…. పోండె హే నాకు అనౌన్స్మెంట్లు… గీనౌన్స్మెంట్లతో సంబంధం లేదు… అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు అరవింద్.