Pawan Kalyan: సీట్ల విషయంలో పవన్‌కు క్లారిటీ వచ్చిందా ? చంద్రబాబు ముందు ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు ?
మధ్యలో స్లో అయినా.. బ్రేకులు పడుతున్నా.. టీడీపీతో జనసేన పొత్తు అనేది మాత్రం క్లియర్. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తెరవెనక జరగాల్సిందంతా జరిగిపోతోంది. సీట్ల పంపకాల నుంచి.. ప్రచార వ్యూహాల వరకు.. రెండు పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు.