Hyderabad: ట్యాంక్ బండ్ పై దూసుకెళ్లిన కారు.. తృటిలో తప్పిన ముప్పు
హైదరాబాద్ లో తరచూ ఏవో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనిపై ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహన చోదకులు వేగాన్ని మాత్రం అదుపు చేయడం లేదు. తాజాగా ట్యాంక్ బండ్ సమీపంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిగా అదుపు తప్పి ఉంటే హూసేన్ సాగర్ నీటిలో పడిపోయేది.