ONDC: స్విగ్గీ, జొమాటోకంటే తక్కువకే ఫుడ్ డెలివరీ.. అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీస్
మార్కెట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనగానే స్విగ్గీ, జొమాటో గుర్తొస్తాయి. ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నా యూజర్లు ఎక్కువగా వాడేవి మాత్రం ఈ రెండింటినే. ఇప్పుడు వీటికి ప్రభుత్వం రూపొందించిన ఓఎన్డీసీ చెక్ పెట్టబోతుంది. ఈ కామర్స్ విభాగంలో కొన్ని సంస్థలు మాత్రమే కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం రూపొందించింది.