Lasya Nandita : వెంటాడిన మృత్యువు.. 3 నెలల్లో మూడు ప్రమాదాలు
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే… ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు.