Oscar winner

Mega Power: చీదరింపుల నుంచి శిఖరం పైకి.. ప్రపంచ సినిమాను శాసిస్తున్న చెర్రీ.. 

Mega Power: చీదరింపుల నుంచి శిఖరం పైకి.. ప్రపంచ సినిమాను శాసిస్తున్న చెర్రీ.. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. సారీ అతనిప్పుడు గ్లోబల్‌ స్టార్‌. అడుగు పెట్టింది చిరంజీవి కొడుకుగానే అయినా.. అతను వచ్చిన తరువాత సీన్‌ మారిపోయింది. చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ అనే స్థాయి నుంచి రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే రేంజ్‌కు వెళ్లిపోయాడు రామ్‌ చరణ్‌. నిజానికి రామ్‌ చరణ్‌ అవమానాలతోనే కెరీర్‌ను ప్రారంభించాడు. అందంగా లేడంటూ ఇన్సల్ట్‌ చేశారు. యాక్టింగ్‌ రాదంటూ జడ్జ్‌ చేశారు. అసలు మెగాస్టార్‌ ఫీచర్స్‌ ఒక్కటి కూడా లేవంటూ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసేలా మాట్లాడారు.