Paris Olympics Indian Women : పారిస్ ఒలింపిక్స్‌తో సత్తా చాటుతున్న భారతీయ మహిళలు..
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత మహిళ క్రీడాకారులు (Indian Women Athletes) తమ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి.. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ (Athletics) లో పాల్గొనేవారు.