Cheddi Gang: హైదరాబాద్ పబ్లిక్.. బీ అలెర్ట్.. సిటీలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది జాగ్రత్త..!
ఇటీవల మియాపూర్‌లోని వసంత సిటీ విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. నాలుగిళ్లలో దోపిడీలకు పాల్పడింది. ఒక ఇంట్లో 30 తులాలు బంగారం దోచుకుంది. ఆరుగురు ముఠా సభ్యులు ఉన్న ఈ చెడ్డీ గ్యాంగ్ వసంత్ విల్లా కమ్యూనిటీలో గోడలు దూకడం, ఇళ్లల్లో చొరబడటం.. అన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.