Police Department

Telangana Government:  డ్రగ్స్ పై తెలంగాణ సర్కార్ క్రియేటివ్ ప్రోగ్రాం.. రీల్స్ పెట్టు.. క్యాష్ పట్టు..

Telangana Government:  డ్రగ్స్ పై తెలంగాణ సర్కార్ క్రియేటివ్ ప్రోగ్రాం.. రీల్స్ పెట్టు.. క్యాష్ పట్టు..

నేటి నవయువ భారతంలో ఎటు చూసినా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని వేదికగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరించడంతో దీనిపై అవగాహనా కార్యక్రమానికి తెర లేపింది. మాదకద్రవ్యాలు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలిపేలా ఒక వీడియో చేసే కాంటెస్ట్ తీసుకువచ్చింది. ఇందులో గెలిచిన వారికి ఫ్రైజ్ మనీని కూడా ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.