Ponguleti Srinivasa Reddy

Congress : తుమ్మలకు ఖమ్మం.. పొంగులేటికి పాలేరు.. పోటీపై ఎట్టకేలకు క్లారిటీ..

Congress : తుమ్మలకు ఖమ్మం.. పొంగులేటికి పాలేరు.. పోటీపై ఎట్టకేలకు క్లారిటీ..

పంచాయితీలకు కేరాఫ్‌ అనిపిస్తుంటుంది కాంగ్రెస్‌. అది జూనియర్లు వర్సెస్ సీనియర్లు కావొచ్చు.. ఇప్పుడు టికెట్ల లొల్లి కావొచ్చు.  రచ్చ లేకుండా ఏ కార్యం ముగియదు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి హస్తం పార్టీలో ..!  ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కంటే.. ఖమ్మం లో ఎవరు ఎక్కడ అన్న దాని మీద ఆసక్తి కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో ! ముఖ్యంగా తుమ్మల, పొంగులేటి విషయంలో ఆ క్యూరియాసిటీ కాస్త పీక్స్‌కు చేరింది.