Lasya Nanditha: తండ్రి పక్కనే.. సాయన్న సమాధి పక్కనే లాస్య సమాధి
అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంత కుమారికి సూచించారు. గతేడాది ఇదే నెలలో లాస్య తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు.