Pre Release

మహేష్‌ మాస్‌ స్వాగ్‌.. గుంటూరు కారం సాంగ్‌ ప్రోమో కేక..

మహేష్‌ మాస్‌ స్వాగ్‌.. గుంటూరు కారం సాంగ్‌ ప్రోమో కేక..

సంక్రాంతి ( Sankranti) కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీని.. బంగారు బాతులా చూస్తున్నారు బయ్యర్స్. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. థమన్ మీద ఈ మధ్య విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఎలాంటి సాంగ్ ఇస్తాడు.. ఏం చేస్తాడు అని డిస్కషన్‌ నడుస్తున్న సమయంలో.. ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్లుగా ఫస్ట్ సాంగ్ ప్రోమో (Song Promo) రిలీజ్‌ చేశారు మేకర్స్. 7వ తేదీని త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే. ఆ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. థమన్ బాణీల కంటే భిన్నంగా ఈ లిరికల్ సాంగ్ అనిపిస్తోంది.