Tomato price: ఎర్ర బంగారంలా మారిన టమాటా.. రానున్న రోజుల్లో కిలో రూ. 150కి చేరే అవకాశం.?
టమాటా లేనిదే ఒక్క రోజు వంట గడవని పరిస్థితి ప్రతి ఒక్క ఇంట్లో నెలకొంది. అలాంటి టమాటాకు ఒక్కసారిగా ధర పెరిగింది. ఎర్రటి పండు ధర నిప్పు కణంలా మండిపోతోంది. మన్నటి వరకూ కిలో రూ. 30 – 40 ఉన్న దీని ధర అమాంతం వంద రూపాయలకు ఎగబాకింది. మన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాగే కనిపిస్తుంది. జాతీయ మార్కెట్ ప్రభావం, వాతావరణ మార్పులు, సరఫరాలో తలెత్తే సమస్యల కారణంగా వీటి ధరలకు రెక్కలొస్తున్నాయని చెప్పాలి. దేశ వ్యాప్తంగా వీటి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం.