Covid-19: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు ఇస్తున్న సంకేతాలేంటి ?
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్ వచ్చింది. బుధవారం నాటికంటే ఇది 20శాతం అధికం. అంతకుముందు రోజు 10,542 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.