Vijaya Sai Reddy: విజయసాయి లేని లోటు జగన్‌కు తెలిసొచ్చిందా.. మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా?
వైసీపీ ప్రతీ అడుగులు, ప్రతీ విజయంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఉండకూడదు కూడా ! పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా.. రాజకీయ అనుభవం లేకపోయినా.. రాజకీయం తెలియకపోయినా.. వైసీపీని సక్సెస్‌ఫుల్ పార్టీగా నిలబెట్టడంలో విజయసాయిది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తే.. దాన్ని నడిపించడంలో విజయసాయికి వందకు 150 మార్కులు పడ్డాయ్.