Veerabhadra Rao : విశాఖలో వైసీపీకి దిమ్మదిరిగే షాక్.. మరో కీలకనేత రాజీనామా..
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నియోజకవర్గాల మార్పు, సిట్టింగ్‌లకు టికెట్ల నిరాకరణతో.. ఇక తమకు అవకాశం లేదు అనుకున్న నేతలు.. ఒకరి తర్వాత ఒకరు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఆళ్లతో మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు విశాఖ వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. వైసీపీకి దూరం కానుంది.